National

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్స్

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయనను కాల్చి చంపేస్తామని ఆ ఫోన్ కాల్స్ లో ఆగంతకుడు బెదిరించాడు. Nitin Gadkari gets death threat: ఆఫీస్ ను కూడా పేల్చేస్తాం.. నాగపూర్ లోని నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయానికి శనివారం ఉదయం ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నితిన్ గడ్కరీని చంపేస్తామని, ఆయన ఆఫీస్ ను పేల్చేస్తున్నామని అందులో బెదిరించారు. శనివారం ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, మధ్యాహ్నం 12.32 గంటలకు ఆఫీస్ ల్యాండ్ లైన్ ఫోన్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.

వెంటనే గడ్కరీ (Nitin Gadkari) ఆఫీస్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఆఫీస్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఆ బెదిరింపు కాల్స్ చేసిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. గడ్కరీ (Nitin Gadkari) నాగపూర్ ఆఫీస్ కు చెందిన బీఎస్ఎన్ ఎల్ ల్యాండ్ లైన్ కు వచ్చిన కాల్ డేటా ను పరిశీలిస్తున్నారు. ఒక్కరే ఆ కాల్స్ చేశారా? లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో నాగపూర్ లోని గడ్కరీ ఆఫీస్ వద్ద భద్రతను మరింత పెంచారు. దేశ రాజకీయాల్లో నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి సమర్ధుడైన నాయకుడిగా, అజాత శత్రువుగా పేరుంది.