National

కోర్టు భవనంలోకి చిరుత పులి; భయంతో వణికిపోయిన సిబ్బంది

కోర్టు భవనంలోకి పొరపాటున ప్రవేశించిన చిరుత పులి అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. పెద్ద ఎత్తున ఉన్న ప్రజలను చూసి ఆందోళనకు గురైన చిరుత అక్కడ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తితో పాటు, మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. Leopard enters court building: ఇద్దరి పై దాడి Leopard enters court building: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న కోర్టు భవనం కాంపౌండ్ లోకి చొరబడిన చిరుత పులి అక్కడ ఉన్న కొంతమందిపై దాడి చేసి గాయపర్చింది. ఆ తరువాత, తనపై ఎవరూ దాడి చేయకుండా, కోర్టు ప్రాంగణంలో ఉన్న ఒక ఇనుప గేటు వెనకాల దాక్కుని, అప్రమత్తంగా అందరినీ గమనిస్తూ ఉండిపోయింది. అక్కడి వారిపై చిరుత దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు తమ ఫోన్లలో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. Leopard enters court building: అటవీ అధికారులకు సమాచారం కోర్టు భవనంలోకి చిరుత ప్రవేశించడంతో అక్కడి వారంతా తీవ్ర భయాందోళలకు గురయ్యారు. అరుపులు, కేకలతో తీవ్ర స్థాయి గందరగోళం నెలకొనడంతో మరింత కన్ఫ్యూజ్ అయిన చిరుత అక్కడి వారిపై దాడికి ప్రయత్నించింది. కోర్టు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు.