పార్వతీపురం : 11 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండలకేంద్రంలో ప్రధాన రహదారి గుండా వెళ్తూ ప్రచారకార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 15-20 తేదీలలో పాట్నా- బీహార్ లో జరిగబోయే ఈ జాతీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. గిరిజన, హరిజన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, లౌకిక వ్యవస్థను , రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ పాలకొండ మండల కార్యదర్శి బెజ్జవరపు వెంకటరమణ, గంట.చిన్నారావు, భారతీ, ప్రమీల, మెల్లిక. చిన్నారావు, ఊర్లక. విజయకుమారి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.