బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నానా తంటాలు పడుతున్నది.
శుక్రవారం నుంచి కర్ణాటక సీఎం బపవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం యడియూరప్ప, నళిన్ కుమార్ కటిల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు బీజేపీ హైకమాండ్ తో చర్చలు మీద చర్చలు జరిపింది.
ఆంటీ మోజులో అరాచకం, భార్యను చంపేసి ఫోటోగ్రాఫర్ డ్రామాలు, ఫోన్ చేసి ఎస్కేప్!
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని, కనీసం 130 స్థానాల్లో విజయం సాధించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇదే సమయంలో గుజరాత్ ఫార్ములాను కర్ణాటకలో ప్రయోగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా డిసైడ్ అయ్యారని తెలిసింది.
కర్ణాటకలో సుమారు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద స్థానికంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని, వారికి సీటు ఇచ్చినా ఎలాంటి పరిస్థితిలో విజయం సాధించలేరని బీజేపీ హైకమాండ్ ముందుగానే చేయించుకున్న సర్వేలో వెలుగు చూసిందని సమాచారం. కర్ణాటకలోని 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎలాంటి పరిస్థితిలో టిక్కెట్ ఇవ్వకూడదని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయ్యిందని ఓ సీనియర్ నాయకుడు ఢిల్లీలో ఓ జాతీయ మీడియాకు చెప్పారు.
నా భార్యకు టిక్కట్ ఇవ్వకపోతే మీ టిక్కెట్ నాకొద్దు, మాజీ ప్రధాని, మాజీ సీఎంకు?
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్పతో ప్రత్యేకంగా సమావేశం అయ్యి చర్చించారు. జేపీ నడ్డా, బీఎస్ యడియూరప్పల మధ్య కేవలం 10 నిమిషాలు మాత్రమే చర్చలు జరిగాయని. తరువాత యడియూరప్ప ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరుకు ఒంటరిగా బయలుదేరారని సోమవారం రాత్రి కన్నడ మీడియా జోరుగా వార్తలు ప్రసారం చేసింది.
సీఎం బసవరాజ్ బోమ్మయ్, కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటేల్ ఇంకా ఢిల్లీలో ఉన్నా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మాత్రమే ఒక్కరే బెంగళూరు బయలుదేరడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఖాలీ చేతులతో ఇంటికి వెళ్లే కర్ణాటకలోని ఆ 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు ? అని ఇప్నుడు కన్నడనాట జోరుగా చర్చ జరుగుతోంది.