దేశంలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రేపు (ఏప్రిల్ 12) పరుగు ప్రారంభించనుంది. అజ్మీర్-జైపూర్-ఢిల్లీ (Ajmer – Jaipur – Delhi) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేపు మొదలు కానుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 14వ వందే భారత్ రైలును వర్చువల్‍గా ప్రారంభించనున్నారు. రాజస్థాన్‍కు ఇదే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కానుంది. జైపూర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జైపూర్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అవి ఏఏ రూట్లలో ఉన్నాయో ఇక్కడ చూడండి.
Vande Bharat Express: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం రెండు వందే భారత్ రైళ్లను ఒకే రోజున ప్రారంభించారు. సికింద్రాబాద్ – తిరుపతి, చెన్నై – కోయంబత్తూరు రైళ్లను పచ్చజెండా ఊపి ఆరంభించారు.
ప్రస్తుతం నడుస్తున్న 13 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రూట్లు ఇవే
న్యూఢిల్లీ – వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా (జమ్ము కశ్మీర్) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
గాంధీనగర్ – ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ – ఆంబ్ అందౌరా హిమాచల్ ప్రదేశ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
చెన్నై – మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
నాగ్‍పూర్ – బిలాస్‍పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
హౌరా – న్యూ జల్పాయ్‍గుడి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ముంబై – సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ముంబై – షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ – భోపాల్ రాణి కమల్‍పతి స్టేషన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
చెన్నై – కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
కాగా, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చైర్ కార్ (CC) క్లాస్ టికెట్ ధర రూ.1,680గా ఉంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ (EC) టికెట్ ధర రూ.3,080గా ఉంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుతుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో ఈ ట్రైన్ బయలుదేరుతుంది. మంగళవారం మినహా అన్ని రోజుల్లో ఈ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. సెమీ హై స్పీడ్ ట్రైన్లుగా ఉన్నాయి. గంటకు సుమారు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇండియాలో ప్రస్తుతం అత్యధిక వేగంతో నడిచే రైళ్లు ఇవే.