National

వికసిత్‌ భారత్‌ టార్గెట్‌ 2047..

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 1న) లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024–25పై మాట్లాడారు. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతూ వచ్చామని తెలిపారు. యువత ఉపాధికి పెద్దపీట వేశాన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.