కర్నాటక (Karnataka) లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు (karnataka assembly elections) జరగనున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల karnataka assembly elections 2023 ఫలితాలపై భారీగా ఆసక్తి నెలకొని ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ఫలితాల ద్వారా తెలుస్తుందన్న అంచనాలో పార్టీలు ఉన్నాయి. తొలి జాబితాలో బీజేపీ (BJP) 52 మందికి తొలిసారి అవకాశం కల్పించింది. అయితే, ఈ ఎన్నికల్లో ప్రధానంగా కొన్ని అసెంబ్లీ స్థానాలపై అందరి ఆసక్తి నెలకొని ఉంది. అవి
ఇది కర్నాటక (Karnataka) లోని హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి. బెంగళూరు గ్రామీణ లోక్ సభ స్థానం పరిధిలోకి ఇది వస్తుంది. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) కు ఇది కంచుకోట వంటిది. 2008 నుంచి వరుసగా ఈ స్థానం నుంచి శివకుమార్ గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో శివకుమార్ కు పోటీగా రాష్ట్ర మంత్రి ఆర్ అశోక్ బీజేపీ బరిలో నిలిపింది.
ఇది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య (Siddaramaiah) నియోజకవర్గం. 2008, 2013ల్లో ఆయన ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన స్వగ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఈ సారి కూడా ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలని, ఇకపై ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇటీవల సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ కాంగ్రెస్ దిగ్గజ నేతకు పోటీగా బీజేపీ రాష్ట్ర మాజీ మంత్రి వీ సోమన్నను బరిలో నిలిపింది.
ఈ చన్న పట్న నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి (HD Kumaraswamy) పోటీ చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చన్న పట్న నియోజకవర్గం నుంచి కుమారస్వామి 2018 లోనూ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కుమార స్వామికి పోటీగా బీజేపీ సీపీ యోగేశ్వరను పోటీలో నిలిపింది.