National

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో శ్రీనగర్ కు బయల్దేరిన స్పైస్ జెట్ విమానం, కాసేపటికి మళ్లీ వెనక్కు తిరిగి వచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ బీ 737 విమానం చివరి భాగంలో ఉన్న కార్గొ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సంకేతాలిచ్చే ఫైర్ లైట్ (fire light) వెలగడంతో, పైలట్లు వెంటనే ఏటీసీ (air traffic control) కి సమాచారమిచ్చి, తిరిగి ఆ విమానాన్ని ఢిల్లీ ఏర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయతే, ల్యాండింగ్ అయిన తరువాత జరిపిన పరీక్షల్లో.. కార్గొ ప్రాంతంలో ఎలాంటి ఫైర్ స్మోక్ ను గుర్తించలేదు. దాంతో, సాంకేతిక లోపం కారణంగా ఆ లైట్ వెలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఆ స్పైస్ జెట్ బీ 737 విమానంలో ఆ సమయంలో 140 మంది ప్రయాణికులున్నారు. ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన తరువాత కాక్ పిట్ లో ఫైర్ లైట్ వెలగడంతో అప్రమత్తమైన పైలట్ ఫ్లైట్ ను మళ్లీ వెనక్కు తీసుకువచ్చి అత్యవసరంగా ల్యాండ్ చేయాలని నిర్ణయించాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత విమానం వెనుకవైపు కార్గొ (aft Cargo) భాగాన్ని తెరిచి చెక్ చేశారు. అక్కడ ఎలాంటి ఫైర్ కానీ, స్మోక కానీ కనిపించలేదు.