152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మైనింగ్ ఓవర్‌మన్, ఓవర్‌మన్ (మ్యాగజీన్), మెకానికల్ సూపర్‌వైజర్ సహా మరిన్ని పోస్టులకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎన్‍టీపీసీ అధికారిక వెబ్‍సైట్ careers.ntpc.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు మే 5వ తేదీ తుదిగడువుగా ఉంది. వివరాలివే. NTPC Recruitment 2023: పోస్టులు ఇవే మైనింగ్ ఓవర్‌మన్: 84 ఖాళీలు ఓవర్‌మన్ (మ్యాగజీన్): 7 పోస్టులు మెకానికల్ సూపర్‌వైజర్: 22 పోస్టులు ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్: 20 పోస్టులు వొకేషనల్ ట్రైనింగ్ ఇన్‍స్ట్రక్టర్: 3 పోస్టులు మైన్ సర్వే: 9 పోస్టులు మైనింగ్ సిరిదార్: 7 పోస్టులు NTPC Recruitment 2023 వయోపరిమితి: ఈ పోస్టులకు వయోపరిమితి 25 సంవత్సరాలుగా ఉంది. ఎస్‍సీ, ఎస్‍టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. మిగిలిన కేటగిరీలకు నిబంధనల మేర మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు NTPC Recruitment 2023: ఈ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‍సీ, ఎస్‍టీ, మహిళలు, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. పోస్టులను బట్టి విద్యార్హతలు, సర్టిఫికేషన్లు విభిన్నంగా ఉన్నాయి. అభ్యర్థులు 12వ తరగతి, సంబంధిత విభాగాల్లో డిప్లమా పాసై ఉండాలి. ఈ వివరాల కోసం నోటిఫికేషన్‍ను అభ్యర్థులు పరిశీలించాలి. careers.ntpc.co.in వెబ్‍సైట్‍లో నోటిఫికేషన్‍ను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది.