National

కేంద్ర మంత్రి ఫైర్, ట్రబుల్ షూటర్ మీద చర్యలు తీసుకోండి, ఎన్నికల్లో !

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ సామాన్య ప్రజలనే కాకుండా మీడియాను కూడా బెదిరిస్తున్నారని. ఆయన దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. ర్యాపిడో బైక్ లో జాగ్రత్త, బైక్ మీద నుంచి దూకేసిన యువతి, ఎక్కడంటే అక్కడ చేతులు ? బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మీద విరుచుకుపడ్డారు. కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న డీకే శివకుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఆ సమావేశానికి డీకే శివకుమార్ చాలా ఆలస్యంగా వచ్చారని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే గుర్తు చేశారు. అప్పటికే ఓపిక నశించిపోయిన కొందరు మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, అక్కడికి వెళ్లిన డీకే. శివకుమార్ ఇక్కడి నుంచి ఎంత మంది రిపోర్టర్లు వెళ్లిపోయారు.

వారి ఏ పత్రికలో, టీవీలో పనిచేస్తున్నారు అని వివరాలు ఇవ్వాలని, తాను ఆ మీడియా సంస్థల యాజమాన్యంతో మాట్లాడుతాను అంటూ రిపోర్టర్లను బెదిరించారని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే ఆరోపించారు. ఇందిరా గాంధీని గుర్తు చేస్తున్న ప్రియాంకా గాంధీ, మేడమ్ మాటలతో ! రానురాను డీకే. శివకుమార్ ఆగడాలు ఎక్కువ అయ్యాయని, ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే ఎన్నిలక కమీషన్ అధికారులకు ఆయన మీద ఫిర్యాదు చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మీద కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే ఎన్నికల అధికారులకు స్వయంగా ఫిర్యాదు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కేసులు పెట్టుకోవడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. కనకపురలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ కార్యకర్తలు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.