CINEMANationalWorld

థాయ్‌లాండ్ లో గ్యాంబ్లింగ్.. చికోటి ప్రవీణ్ సహా 83 మంది ఇండియన్స్ అరెస్ట్

గ్యాంబ్లింగ్ కింగ్ చికోటీ ప్రవీణ్ సహా మొత్తం 93 మంది భారతీయులను గ్యాంబ్లింగ్ ఆడుతుండగా థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు.

పట్టాయాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో అనేక మంది భారతీయులు అనధికారికంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు అర్ధరాత్రి థాయ్ లాండ్ పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు.

ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూ‍ంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించిన 93 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయిస్, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారు. 93 మందిలో 80 మంది భారతీయ జూదగాళ్లు కాగా మరికొందరు గేమ్ ల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. ఈ ముఠాలో 14 మంది మహిళలు కూడా ఉన్నారు.

వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చికోటి ప్రవీణ్ నేతృత్వంలోనే ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కోట్ల రూపాయిల నగదు, సుమారు 21 కోట్ల రూపాయిలు విలువ చేసే గేమింగ్ చిప్స్‌, ఎనిమిది క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్ ఫోన్‌లు, మూడు నోట్‌బుక్‌లను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈమొత్తం వ్యవహారంలో థాయ్‌లాండ్ కు చెందిన 32 ఏళ్ల ‘సిత్రనన్ కేవ్‌లోర్’ అనే మహిళ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.

థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ కోసం ఒక్కొక్కరి నుంచి లక్షల్లో చికోటి ప్రవీణ్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. చికోటితో పాటు పటాయా పోలీసుల అదుపులో మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులున్నారు. అక్కడ గ్యాంబ్లింగ్ ఆడుతున్న వారందరినీ థాయ్‌లాండ్ కు చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డిలు తీసుకెళ్ళారు.