National

సూడాన్ పోరులో 400 మందికి పైగా మరణం , 3,500 మందికి గాయాలు

సూడాన్ లో మిలటరీ, పారా మిలటరీకి మధ్య జరుగుతున్న సాయుధ పోరులో ఇప్పటి వరకు 413 మంది మరణిం చారని 3,500 మంది తీవ్ర గాయాలపాలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.

 

WHO ప్రతినిధి మార్గరెట్ హారిస్ UN విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,ఈ పోరులో పిల్లలు అధిక మూల్యాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం తొమ్మిది మంది పిల్లలు మరణించగా,50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆమె చెప్పారు.

ఏప్రిల్ 15 నుండి ఇప్పటి వరకు 11 ఆస్పత్రులపై దాడులు జరిగాయని మార్గరెట్ హారిస్ చెప్పారు.

సుడాన్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దాడుల వల్ల 20 ఆస్పత్రులను మూసేశారని, మరో 12 ఆస్పత్రులుమూసేసే ప్రమాదం ఉన్నదని అని హారిస్ చెప్పారు.

యుద్దం లో పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారని, దేశంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేదని హారిస్ తెలిపారు. ఆహారం, నీరు, మందులు అయిపోయే [ప్రమాదం కూడా ఉందని ఆమె అన్నారు.

పిల్లలలో పోషకాహారలోపం ఎక్కువగా ఉన్న దేశాలలో సూడాన్ ఒకటి ఇప్పుడా దేశంలో ఉన్న యుద్ద పరిస్థితులు పిల్లల జీవితాలను ప్రశ్నార్దకం చేశాయి అని ప్రపంచఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. 6,00,000 కంటే ఎక్కువ మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.

దేశంలో విద్యుత్ లేకపోవడం వల్ల 40 మిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్లు, ఇన్సులిన్ లు పాడయిపోయాయని WHO ప్రతినిధి మార్గరెట్ హారిస్ చెప్పారు.