National

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు రానున్నాయి.

24 గంటల్లో అధికారం ఎవరిదో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా కర్ణాటక జపమే చేస్తున్నాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి ప్రభావం తెలంగాణపై ఎలా ఉంటుంది అని లెక్కలు వేసుకుంటున్నాయి.

అంచనాల్లో తెలంగాణ పార్టీలు..
ప్రతీ పార్టీకీ కొన్ని అంచనాలూ, వ్యూహాలూ ఉంటాయి. వాటిని సరిగ్గా వేసుకోకపోతే.. అడ్డంగా చిక్కుల్లో పడతాయి. ఈ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌కి కనిపిస్తోంది. ఈ మూడు పార్టీలూ.. కన్నడిగుల తీర్పు ఏంటి అని ఎదురుచూస్తున్నాయి. రేపు మధ్యాహ్నం కల్లా.. మ్యాటర్‌ తెలిసిపోతుంది.

బీజేపీ అధికారం నిలబెట్టుకుంటే..
కర్ణాటకలో అధికార బీజేపీ అధికారంలోకి వస్తే.. అది ఆ పార్టీకి భారీ విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. కర్ణాటకలో వరుసగా ఒకేపార్టీకి రెండోసారి అధికారం దక్కదు. అలాంటి అరుదైన ఫీట్‌ బీజేపీ సాధించినట్లు అవుతుంది. అది తెలంగాణలో ఆ పార్టీకి ఎక్స్‌ట్రా మైలేజ్‌ తెస్తుంది. సౌత్‌లో బలంగా పాతుకుపోవాలి అనుకుంటున్న బీజేపీ… నెక్ట్స్‌ తెలంగాణను ఓ పట్టు పట్టగలదు. ఆల్రెడీ బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే తెలంగాణపై ఫోకస్‌ పెట్టారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చనే ఉద్దేశంతో.. ముందునుంచే అప్రమత్తంగా ఉంటూ.. తమ కేడర్‌ని నిరంతరం యాక్టివ్‌గా ఉంచుతున్నారు.