కర్నాటక అసెంబ్లీ ఫలితాలు (Karnataka Assembly Results)రసవత్తరంగా మారాయి. గెలిచేది ఏ పార్టీ అనే విషయం మరికాసేపట్లో అధికారికంగా తెలియనుంది. ఇప్పటికే స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్(Congress)ఫుల్ జోష్‌లో ఉంది.
పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొని స్వీట్లు పంచుకుంటున్నారు. అయితే ఈసారి కూడా బీజేపీ(BJP)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ధృడ సంకల్పంతో స్వయంగా ప్రధాని మోదీ(Modi), యూపీ సీఎం యోగి(UP CM Yogi), హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె. పి. నడ్డా రాష్ట్రమంతా సుడిగాలి ప్రచారం చేపట్టినప్పటికి వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. ప్రచారం చేసిన చాలా చోట్ల కమలనాథులు గెలవలేదు. ఇంతకీ బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి..? ఏ స్థానాల్లో విజయం సాధించారు..? ఎక్కడ పరాజయం పొందారు..? ఇలాంటి పూర్తి వివరాలు ఇదిగో మీకోసం.
మోడీ ప్రచారం చేసిన ప్రాంతాల సంగతేంటి.?
*హుమ్నాబాద్- సిద్దూ పాటిల్- గెలుపు
* విజయపుర- బసనగౌడ పాటిల్ యత్నాల్- గెలుపు
* కుడచి- పి. రాజీవ్ ఓటమి
* యలహంక- ఎస్.ఆర్. విశ్వనాథ్ – విజయం
* కోలార్- వర్తుర్ ప్రకాష్- ఓటమి
* చన్నపట్నం- సి.పి. యోగేశ్వర్-సోలు
* బేలూరు- హుల్లహళ్లి సురేష్- గెలుపు
* చిత్రదుర్గ- జి.హెచ్. తిప్పారెడ్డి- ఓటమి
* విజయనగర్- సిద్ధార్థ్ సింగ్-ఓటమి
* సింధనూరు- కె. కరియప్ప- ఓటమి
* మూడబిద్రి- సునీల్ కుమార్- గెలుపు
* కార్వార్- రూపాలి నాయక్-ఓటమి
* కిత్తూరు-మహాంతేష్ దొడ్డగౌడర్- ఓటమి
* చిత్తాపూర్-మణికాంత్ రాథోడ్-సోలు
* నంజనగూడు- బి. హర్షవర్ధన్-ఓటమి
* తుమకూరు రూరల్- బి. సురేష్ గౌడ- గెలుపు
* బెంగళూరు సౌత్- ఎం. కృష్ణప్ప – గెలుపు
* బాదామి- శాంతగౌడ పాటిల్-ఓటమి
* హావేరి-గవిసిద్దప్ప ద్యామన్నవర్ల-సోలు
* షిమోగా రూరల్ – అశోక్ నాయక్ – ఓటమి
* చిక్కోడి- రమేష్ కత్తి- ఓటమి
షా క్యాంపెయిన్ వర్కవుట్ కాలేదా..?
ఇక బీజేపీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న అమిత్‌షా సైతం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. అయితే ఏ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం వర్కవుట్ అయిందో చూద్దాం.
Karnataka: డీకే బర్త్ డే రోజునే కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కార్..అధిష్టానం ఇచ్చే కానుకపై సర్వత్రా ఆసక్తి!
అమిత్ షా ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఇవే
* తెరదల- విజయం
* దేవుని హిప్పరాగి- ఓటమి
* అఫ్జల్‌పురా- ఓటమి
* యాదగిరి- ఓటమి
* విరాజపేట- ఓటమి
* బంట్వాళ- విజయం
* కుందాపుర- ఓటమి
* మంగళూరు సిటీ- గెలుపు
* నంజనగూడు- ఓటమి
*హగరిబొమ్మనహళ్లి-
* దావంగెరె సిటీ-
*రాణేబెన్నూరు-
*బాడగి-
* హలియాల- ఓటమి
*శిమోగా-
*చల్లగా ఉండండి-
*చిక్‌మగళూరు-
* మగాడి- ఓటమి
*శిడ్లఘట్ట-
* మలూరు-
* దొడ్డబల్లాపూర్-విజయం
* వరుణ- ఓటమి
* కడూరు- విజయం
* నాబ్-
*నాగమంగళ-
*మైసూర్-
*చిక్కోడి-
* ఇక్కడ-
* సౌదత్తి యల్లమ్మ-
*రామదుర్గ-
*బళ్లారి-
* బీదర్ నగర్- ఓటమి
* ముస్కీ- ఓటమి
* ధార్వాడ్ సిటీ – ఓటమి
* శిరహట్టి – విజయం
యోగీ పాచిక పారలేదుగా..
ఉత్తరప్రదేశ్ సీఎం, బీజేపీ బుల్డోజర్ సీఎంగా ముద్రపడిన నేత యోగి ఆదిత్యనాధ్ సైతం కర్నాటక ప్రచారాన్ని ప్రెస్టేజియస్‌గా తీసుకున్నారు. అయితే కన్నడ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కే పట్టం కట్టబోతున్నారు.
యోగి ప్రచారం చేసిన ప్రాంతాల సంగతేంటి?
యోగి ప్రచారం చేసిన ప్రాంతాల సంగతేంటి?
* బసవన్‌బాగేవాడి- ఓటమి
*శృంగేరి-
* పుత్తూరు- ఓటమి
* కర్కల – విజయం
*బైందూరు-
*భత్కల-
* గంగావతి- ఓటమి
* జావర్గి- ఓటమి
* షాపూర్-
బీజేపీ జాతీయ అధ్యక్షుడు సైతం కర్నాటక ప్రచారంలో సుడిగాలి పర్యటన చేపట్టారు.కాకపోతే ఆయన పెట్టిన ఎఫర్ట్ అంతా వర్కవుట్ కాలేదని ఓటర్లిచ్చిన తీర్పుతో తేలిపోయింది.
జె. పి. నడ్డా ప్రచారం చేసిన నియోజకవర్గాల కథేమిటి?
* శిరసి- ఓటమి
* సొరబ- ఓటమి
* ముదిగెరె-ఓటమి
* హసన్- ఓటమి
* కొప్పల – ఓటమి
*సురపుర-
*సెడమ్-
* బీదర్ నగరం-ఓటమి
* ముద్దెబిహాల- ఓటమి
*రంగు-
*హర్పనహళ్లి-
*సుళ్య- విజయం
* కాపు- విజయం
* తీర్థహళ్లి- విజయం
* KGF- ఓటమి
*కొరటగెరె-
*హోస్దుర్గ-
* హొన్నాలి- ఓటమి
* చాముండేశ్వరి- ఓటమి
* హెచ్‌డి కోటే-
* రామనగర- ఓటమి
*సిరగుప్ప-
*రాయచూర్ సిటీ-
* రాయచూరు రూరల్-
* మలవల్లి- ఓటమి
* మేలుకోటే- ఓటమి
* మడికేరి- ఓటమి
వార్ వన్ సైడే ..
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల 2023 ఫలితాల కోసం కర్నాటక ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. నెల రోజుల క్రితం ప్రచారంతో మొదలైన ఎన్నికల హడావుడి ఇవాళ్టి ఫలితాల తర్వాత ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది.
అభ్యర్థులు మరియు అర్హులైన ఓటర్లు..
కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 58,545 పోలింగ్ బూత్‌లలో మొత్తం 5.31 కోట్ల మంది ఓటర్లు తమ భవితవ్యాన్ని నిర్ణయించారు. మొత్తం ఓటర్లలో 2.67 కోట్ల మంది పురుషులు, 2.64 కోట్ల మంది మహిళలు, 4,927 మంది ఇతరులు, 2430 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు ఉన్నారు.
స్టార్ అభ్యర్థులు
రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై (శిగ్గంవి), ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య (వరుణ), జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి (చన్నపట్న), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (కనక్‌పురా) పోటీలో ప్రముఖులు. బొమ్మై, సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మరో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. షెట్టర్ ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.
మళ్లీ పాత సంప్రదాయమే..
1985 నుంచి కర్ణాటకలో ఏ అధికార పార్టీ గెలవలేదు. 38 ఏళ్ల సంప్రదాయాన్ని తుంగలో తొక్కామని అధికార బీజేపీ ప్రకటించినా.. ఈసారి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఈసారి మళ్లీ పాత సంప్రదాయం కొనసాగుతోంది.