NationalPOLITICS

ఒకే ఇంట్లో డబుల్ ఢమాక, తండ్రీకొడుకు ఎమ్మెల్యేలు, భారీ మెజారిటీ !

బెంగళూరు/దావణగెరె: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని మెజారిటీ వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, కాని కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయని సర్వేలు కూడా చెప్పలేకపోయాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మూడు పార్టీలతో ఫుట్ బాల్ ఆడుకున్న గాలి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే !

కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దావణగెరెకి ఓ ప్రత్యేకత దక్కింది. దావణగెరె దక్షిణ, దావణగెరె ఉత్తర అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే విజయం సాధించారు. పక్కపక్క నియోజక వర్గాల్లో ఒకే పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే ఇక్కడ ఒకే ఫ్యామిలీలో డబుల్ ఢమాకా మోగింది.

రెండు నియోజక వర్గాల్లో పోటీ చేసిన తండ్రీ కొడుకు విజయం సాధించడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనింది. దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శామనూరు శివశంకరప్ప పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మీద 83, 839 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శామనూరు శివశంకరప్ప కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు.

మాజీ సీఎంలు శెట్టర్, కుమారస్వామికి ఓటర్లు షాక్, దూసుకుపోతున్న గాలి !

90 ఏళ్లు దాటినా ఎంతో హుషారుగా ఉండే శామనూరు శివశంకరప్పకు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో ఆయన మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక దావణగెరె ఉత్తర అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ శామనూరు శివశంకరప్ప కుమారుడు ఎస్ఎస్. మల్లికార్జున్ కు ఇచ్చారు. తండ్రి కొడుకులు పక్కపక్క నియోజక వర్గాల్లో పోటీ చేశారు.

ఎస్ఎస్ మల్లికార్జున్ కూడా 78, 345 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మీద విజయం సాధించారు. తండ్రీ కొడుకులు శామనూరు శివశంకరప్ప, ఎస్ఎస్ మల్లికార్జున్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో దావణగెరెలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేసారి తండ్రీ కొడుకులు విజయం సాధించడంతో దావణగెరె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.