ప్రస్తుత కాలంలో అవసరాలకు తగ్గట్టుగా ఒకరే పని చేస్తే సరిపోదు భార్యాభర్తలు ఇద్దరూ కూడా రెండు చేతులు వేస్తేనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
ఇకపోతే భార్య భర్తలు ఇద్దరూ కూడా ఆర్థిక భరోసా పొందాలి అంటే వారికోసం ఒక ప్రభుత్వ పథకం ముందుకు వచ్చింది. అలాంటి పథకాలలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం కూడా వుంది. 2004లోనే ప్రారంభమైన ఈ పథకం ఈ మధ్యకాలంలో పలు మార్పులు చేయబడింది. ముఖ్యంగా ఇందులో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కూడా పెంచి ఏకంగా పెట్టుబడి రెట్టింపు చేయడం జరిగింది.
అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వడ్డీ రేట్లు కూడా పెంచిన నేపథ్యంలో సీనియర్ సిటిజెన్లకు అదనపు లాభం లభిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే భార్య భర్తలు ఇద్దరూ కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 41 వేల రూపాయలను వడ్డీ కింద పొందవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.. పేరులో ఉన్నట్టుగానే వృద్ధుల కోసం కూడా ప్రత్యేకంగా రూపొందించిన పథకం ఇది.. ఎవరైతే 60 సంవత్సరాలు వయసు దాటి ఉంటారు. అలాంటి వారు ఈ పథకంలో డబ్బులను దాచుకోవచ్చు.
రిటైర్మెంట్ సమయంలో వచ్చే డబ్బులను ఈ పథకంలో దాచుకొని ప్రతి నెల వడ్డీని పొందవచ్చు.. లేదా ఈ పథకంలో ఐదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేసి మరో మూడు సంవత్సరాల పాటు మెచ్యూరిటీ సమయాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. ఇక ఈ పథకంలో మీరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా దానిని ఇప్పుడు ఏప్రిల్ ఒకటి నుంచి రూ.30 లక్షలకు పెంచడం జరిగింది. అంతేకాదు 8.20 శాతం వడ్డీ కూడా లభిస్తున్న నేపథ్యంలో ఏడాదికి రూ.2,46,000ను వడ్డీగా పొందవచ్చు.
అంటే నెలకు రూ.20,500 చొప్పున పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ ఇందులో భార్యాభర్తలిద్దరూ కూడా వేరువేరుగా 60 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రతినెల 41 వేల రూపాయలను పొందవచ్చు. అంటే ఐదు సంవత్సరాల లో ఇద్దరికీ కలిపి రూ.24,60,000 వడ్డీ కింద పొందుతారు. ఐదేళ్ల తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తం వెనక్కి లభిస్తుంది.