National

ఐటీ హబ్ లో ప్రత్యేక హెల్ప్ లైన్, పిన్ టూ పిన్ మ్యాటర్ !

బెంగళూరు/యశవంతపురం: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో బాధితులను ఆదుకునేందుకు బెంగళూరులోని యశ్వంత్‌పూరం రైల్వే స్టేషన్‌లో శనివారం సహాయ కేంద్రాన్ని (హెల్ప్ లైన్) ప్రారంభించారు.

అంతేకాకుండా ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో కన్నడిగులకు అవసరమైన సహాయం మరియు భద్రతా సమాచారాన్ని అందించడానికి స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సెంటర్ (SEOC) వద్ద పౌరుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ ప్రారంభించారు.

శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో కన్నడిగుల భద్రత కోసం మంత్రి సంతోష్ లాడ్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఒడిశాకు వెళ్లింది. 233 మంది ప్రాణాలను బలిగొన్న రైలు ప్రమాద స్థలంలో ఇప్పటికే డ్రోన్ ల సహాయంతో వీడియోలు తీశారు. డ్రోన్ వీడియో పుటేజీలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య కార్యదర్శి తెప్పించుకున్నారని తెలిసింది.

కన్నడిగుల భద్రతను నిర్ధారించడానికి మరియు వారికి అవసరమైన అన్ని సహాయాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని, మరేదైనా సమస్య ఎదుర్కొన్న కన్నడిగుల రక్షణకు పూర్తి సహాయాన్ని అందిస్తామన్నారు. ప్రతి కన్నడిగుడిని సురక్షితంగా కర్ణాటకకు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే స్పష్టం చేశారు.