మాజీ మంత్రి వివేకా హత్య(Viveka Murder) కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ తేల్చింది. ఇప్పటి వరకు ఆయన నిందితుడా? అనుమానితుడా?
అంటూ కోర్టు ప్రశ్నించిన విషయం విదితమే. అయితే, తాజాగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు కౌంటర్ వేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడిగా(A8) చేర్చింది. హత్య జరిగిన తరువాత సాక్ష్యాలను తారుమారుచేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశారని అఫిడవిట్ లో పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం దీనిపై విచారణ జరగనుంది.
ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి ఇక సేఫ్ జోన్లోకి వెళ్లినట్టు వైసీపీ భావించింది. కానీ, సీబీఐ దూకుడును మళ్లీ పెంచింది. దర్యాప్తు కొనసాగుతుందని చెబుతోంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని సాక్ష్యాలతో సహా పట్టుకున్నామన్న విషయాన్ని సీబీఐ చెబుతోంది. ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది. మరో నిందితుడు శివశంకర్ రెడ్డి. ఫోన్ చేసిన నిమిషంలోనే హత్య జరిగిన ప్రాంతానికి అవినాష్ రెడ్డి చేరుకున్నారని అఫిడవిట్ లో సీబీఐ(Viveka Murder ) పేర్కొనడం గమనార్హం.