National

కేశినేని 100శాతం పార్టీ మార్పు?

విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని టీడీపీని(Vijayawada TDP) డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీ ఇంచార్జిలను గొట్టంగాళ్లంటూ రెచ్చిపోయారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై దురుసుగా మాట్లాడారు. మహానాడుకు ఆహ్వానం ఇవ్వలేదని, ఆ గొట్టంగాళ్లు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత? అంటూ విరుచుకుపడ్డారు. ఇలా తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ అధిష్టానంను సైతం ఇరకాటంలో పెడుతోన్న విజయవాడ ఎంపీ వాలకం అధిష్టానంకు తలనొప్పిగా మారింది.

100శాతం కాలినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటానని సంచలన వ్యాఖ్యలు (Vijayawada TDP)

తాజాగా చంద్రబాబు(Chandrababu) ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేశినేని కలిసే ఉన్నారు. ఒక వైపు విమర్శలు చేస్తూనే మరో వైపు పార్టీలో కొనసాగుతూ గత మూడేళ్లుగా నెట్టుకొస్తున్నారు. ఒకానొక సందర్భంలో లోకేష్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. చెత్తగ్యాంగ్ ను పెంచి పోషిస్తున్నాడంటూ లోకేష్ మీద పరోక్షంగా రెండేళ్ల క్రితమే మండిపడ్డారు. ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని బలహీనతలను ఎత్తిచూపారు. ఆ సమయంలో టీడీపీకి గుడ్ బై చెబుతున్నారని ప్రచారం జరిగింది. బీజేపీలో చేరతారని అనుకున్నారు. కానీ, పార్టీని వీడేదిలేంటూ విజయవాడ కార్పొరేషన్ (Vijayawada TDP) ఎన్నికల్లో కీలకంగా మెలిగారు. కుమార్తె శ్వేతను గెలుపించుకున్నారు. ఆమెను కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్టానం మీద అప్పట్లో ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, ఆయన వ్యతిరేక గ్రూప్ గా ఉన్న బొండా ఉమ, బుద్దా వెంకన్న, దేవినేని తదితరులు అడ్డుకున్నారని భావించారు. అందుకే, అప్పట్లోనే వాళ్ల మీద కేశినేని తిరగబడ్డారు. ఆ సందర్భంగా విజయవాడ టీడీపీలోని విభేదాలు భగ్గుమన్నాయి.