National

బెంగళూరులో వాటి కథ త్వరలో తేలుస్తామని చెప్పిన డీకే శివకుమార్, అక్రమంగా!

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లను నిలిపివేయడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీని గట్టిగా విమర్శించమని చెప్పండి, అందరి బండారం బట్టబయలు చేస్తాను అంటూ కర్ణాటక డీసీఎం డీకే.

శివకుమార్ మండిపడ్డారు. బ్రాండ్ బెంగళూరు గురించి బుధవారం వికాససౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడారు.

వివాహిత మహిళతో లస్క్ టపా, ఇంకా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి ప్లాన్ బి!

ఈ సమయంలో బీజేపీపై విమర్శల గురించిన డీకే శివకుమార్ మాట్లాడుతూ బీజేపీని ఇంకా గట్టిగా విమర్శించమని చెప్పండి, రాజరాజేశ్వరి నగర్‌లో ఎలాంటి పనులు చేయకుండానే రూ.123 కోట్ల బిల్లులు చేసుకున్నారని, లోకాయుక్త అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని, బీడీఏలోనూ సిట్‌ను నిర్మించే పరిస్థితి నెలకొందపి. కార్పొరేషన్‌లో కూడా ఇది జరుగుతుందని, దీనిపై చర్చిద్దాం అని బీజేపీ నాయకులకు డీకే శివకుమార్ సవాలు విసిరారు.

పేదల పైనే రాజకీయం చేస్తున్నారని నాపై బీజేపీ నాయకులువిరుచుకుపడుతున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. ఈసారి బెంగళూరులో భారీ వర్షాల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ స్పందిస్తూ నిన్న కొన్ని రిసార్ట్స్ మరియు ఇతర ప్రాంతాల్లో అక్రమంగా రాజకాలువల మీద నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేశామని, ఆక్రమంగా నిర్మించిన ప్రాంతాలను గుర్తించి అన్ని నేలమట్టం చేస్తామని డీసీఎం డికే శివకుమార్ హెచ్చరించారు.

అందమైన ఆంటీని అరాచకంగా చంపేశారు. ఇంజనీర్ భర్త గోవాలో, కొడుకు ఎంబీబీఎస్!

ఈ విషయంపై పనిచేసేందుకు అధికారులకు పూర్తి అధికారం కల్పించామని డీకే శివకుమార్ అన్నారు. మంగళవరాం బెంగళూరులో కురిసిన భారీ వర్షం కారణంగా అక్రమ కట్టడాల కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేశామని, త్వరలో బెంగళూరు నగరంలోని బీబీఎంపీ అన్ని విభాగాల్లోని అక్రమ కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేస్తామని కర్ణాటక డీసీఎం డీకే. శివకుమార్ చెప్పారు.