National

కరెంట్ చార్జీలు గతంలోని ప్రభుత్వం పెంచింది, మాకు ఏమి సంబంధం. మంత్రి మాటలతో!

బెంగళూరు: మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే బీజేపీ విద్యుత్ చార్జీలు పెంచిందని, అలాగే విద్యుత్ చార్జీల పెంపుతో మాకు సంబంధం లేదని, విద్యుత్ ఛార్జీలను పెంచింది మేము కాదని, కరెంటు చార్జీల ధరలు పెంపు నిర్ణయం ఉపసంహరించుకోలేమని కర్ణాటక మంత్రి ఎంబీ .పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం విద్యుత్ చార్జీల పెంపుపై మంత్రి ఎంబీ. పాటిల్ మీడియాతో మాట్లాడారు.

 

స్వయం ప్రతిపత్తి కలిగిన కేఇఆర్ సీ ఈ విద్యుత్ ఛార్జీలను పెంచిందని, అది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే విద్యుత్ చార్జీలు పెరిగాయని, కాబట్టి ధరల పెరుగుదలతో మాకు సంబంధం లేదని. పెంచిన చార్జీలు మేము ఎలా ఉపసంహరించుకుంటామని మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇప్పటికే ఈ విషయంలో వివరణ ఇచ్చారని, అయినా తాను సీఎంతో చర్చిస్తానని మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారు.