National

“వ్యూహం” పై ఆర్జీవీకి కాంగ్రెస్ వార్నింగ్ – బట్టలూడదీసి కొడతాం, ఖబడ్దార్..!!

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మకు కాంగ్రెస్ నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా ఆర్జీవీ తీస్తున్న వ్యూహం టీజర్ కు విశేష స్పందన వచ్చింది.

అందులో వైఎస్సార్ మరణం సమయం నుంచి రాజకీయంగా జగన్ చేసిన రాజకీయ పోరాటం హైలైట్ చేసారు. కాంగ్రెస్ తీరు..కేసులు…సీబీఐ విచారణ..ఓదార్పు యాత్ర అన్నీ కంటికి కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసి నట్లుగా స్పష్టం అవుతోంది. దీని పైన ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు.

వ్యూహం పై మొదలైన వివాదం : రాం గోపాల్ వర్మ విడుదల చేసిన వ్యూహం కు భారీ రెస్సాన్స్ వస్తోంది. వైఎస్సార్ మరణం తరువాత జగన్ కుటుంబం కష్టాలు.. చంద్రబాబు కళ్లల్లో కనింపిచీ..కనిపంచనిఆనందం, జగన్‌ని సీబీఐ అరెస్ట్ చేయడం, అదే సమయంలో భారతి రోడ్డు మీద పడిన ఆవేదన, పదవి కోసం చంద్రబాబు వెయిట్ చేయడం..జగన్- భారతిల మధ్య అనుబంధం, వంటివి టీజర్ లోనే అర్దం అయ్యేలా చూపించారు.

 

ఓదార్పు యాత్ర.. కాంగ్రెస్ నేతల వార్నింగ్ లను అందులో ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు నచ్చటం లేదు. ఈ వ్యూహం లో జగన్ రాజకీయ శత్రువుగా చంద్రబాబును చూపించారా..అసలు తన నిర్ణయాలతో జగన్ కాంగ్రెస్ వీడి బయటకు వచ్చేలా చేసిన సోనియాను ప్రధాన రాజకీయ శత్రువుగా ప్రస్తావించారా అనేది ఆసక్తిని పెంచుతోంది.

ఆర్జీవీకి కాంగ్రెస్ వార్నింగ్ : ఇప్పుడు ఈ వ్యూహం టీజర్ పైన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాం గోపాల్ వర్మకు మెంటల్ బ్యాలెన్స్ లేదని ఆరోపించారు. వ్యూహం సినిమాలో సోనియా గాంధీని చెడుగా చూపిస్తే బట్టలూడదీసి కొడతాం..ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అసలు వాస్తవాలు వర్మకు తెలుసా అని ప్రశ్నించారు.

తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ హెచ్చరికల పైన వర్మ స్పందించకపోయినా..ఆర్జీవి మనస్తత్వం పరిశీలిస్తే ఇటువంటి వాటిని ఆహ్వానిస్తారు. తన సినిమాకు మరింత క్రేజ్ పెంచుకొనే ప్రయత్నం చేసారు. టీజర్ కు పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఆర్జీవి వ్యూహంలో టీజర్ తోనే అదరగొట్టారని..సినిమా పైన మరింత ఆసక్తి పెరుగుతోందంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి.