National

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.. 26 మంది మృతి, 40 మంది గల్లంతు

సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షం కారణంగా రాత్రిపూట ఆకస్మిక వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య 26కి పెరిగిందని, 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు ఆదివారం తెలిపారు.

శుక్రవారం నుంచి వరదల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది మరణించారని, ఆస్తినష్టంతో పాటు వ్యవసాయ భూములకు అపార నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫివుల్లా రహీమి తెలిపారు.

 

మైదాన్ వార్దక్ ప్రావిన్స్‌లోని జల్రెజ్ జిల్లాలో ఉన్న ప్రధాన విపత్తు జోన్‌కు తక్షణ సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ రుతుపవనాల జోన్ వెలుపల ఉన్నప్పటికీ, భారీ వర్షాలు కురిసి తడి సీజన్‌లో ఆకస్మిక వరదలు క్రమం తప్పకుండా జరుగుతాయి. శుక్రవారం నుంచి జల్రేజ్‌లో 604 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయని, వందలాది ఎకరాల వ్యవసాయ భూములు, తోటలు ధ్వంసమయ్యాయని రహీమీ విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశవ్యాప్తంగా గత నాలుగు నెలల్లో, ప్రకృతి వైపరీత్యాల సంబంధిత సంఘటనలలో 214 మంది మరణించారని రహీమి చెప్పారు.