National

కళ్ల పీకేసే సమర్థుడు: ఆ ముగ్గురు నేతలపై లోక్‌సభ బండి సంజయ్ సంచలనం

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై లోక్‌సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యఖ్యలపై తీవ్రస్థాయిోల ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ గజినీలా మారాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్.

అవిశ్వాసం ఎందుకు పెట్టారో ప్రతిపక్ష నేతలకే తెలియదని అన్నారు. రాహుల్ వ్యవహారశైలి చూసి ప్రపంచం నవ్వుకుంటోందని అన్నారు బండి సంజయ్. భారతమాత హత్య ఎప్పటికీ జరగదని.. భారతదేశంవైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకేసే సమర్థుడైన ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివద్ధి సాధించిందని బండి సంజయ్ అన్నారు. శాంతిభద్రతలకు, దేశ భద్రతకు ఢోకా లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది యువత బలి దానాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిందని అన్నారు. అప్పటి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్.. కాంగ్రెస్ ఇవ్వకుంటే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తామని చెప్పడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ప్రజలకు చిన్నమ్మ అండగా ఉంటామని చెప్పారని బండి సంజయ్ తెలిపారు.

రాష్ట్రీయ స్వయం సేవక్(RSS) కార్యకర్తలు నెక్కర్లు ధరిస్తే వారిని అవమానించారని రాహుల్‌పై మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉదయం లేవడంతో భారతమాతకు వందనం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నమస్తే సదా వత్సలే అంటూ ఆర్ఎస్ఎస్ గేయాన్ని బండి సంజయ్ ఆలపించారు.