దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఎవరిపైనా రానటువంటి ఆరోపణలు అదానీ గ్రూప్ పై వస్తున్నాయి. గతంలో హిండెన్ బెర్గ్ రిపోర్టు బయట పెట్టిన విషయాలను అవాస్తవాలు అని నిరూపించుకోలేకపోయారు.
సెబీతో దర్యాప్తు పేరుతో అలా బండి నడిపించేస్తున్నారు. కానీ నిజాలేమిటో కళ్ల ముందే ఉన్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థ.. అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇండియా నుంచే బిలియన్ డాలర్లను బయటకు తరలించి వాటినే విదేశీ పెట్టుబడులుగా అదానీ గ్రూపుల్లోకి పంపాలని నివేదిక వెల్లడించింది.
దీినిపై పక్కా సాక్ష్యాలతో కథనాలు వెలువవడ్డాయి. గౌతమ్ అదానీ తమ్ముడు వినోద్ అదానీ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారని..ఇద్దరు విదేశీయులైన తన కంపెనీలోని డైరక్టర్లతో .. అదానీ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను ప్రవహింపచేశారని ఆరోపించారు. ఇలా చేయడానికి కారణం అదానీ స్టాక్ ధరలు పెంచడమే. ఇష్టారీతిన అదానీ గ్రూప్ షేర్ల ధరలు పెంచుకుని వాటి ద్వారా..పోర్టులు, ఎయిర్ పోర్టులు సహా అనేక ఆస్తులు అదానీ కొనుగోలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపమల్ని అదానీ గ్రూప్ ఎప్పటిలాగే తిరస్కరించింది. హిండెన్ బెర్గ్ చేసిన ఆరోపమల్నే మళ్లీ చేశారని ఆరోపించారు. వీటిపై గతంలోనే తమకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకుంది. తమపై ఇలాంటి ఆరోపణలతో కుట్రలు చేస్తోంది జార్జ్ సోరోస్ అనే వ్యక్తి అని..ఆయన ఇండియాపై కుట్ర చేస్తున్నారని అదానీ గ్రూప్ ఆరోపిస్తోంది. జార్జ్ సోరోస్ ను ఇటీవలి కాలంలో బీజేపీ దేశానికి ఓ విలన్ లాగా ప్రొజెక్ట్ చేస్తోంది. బూచిగా చూపిస్తోంది. ఇప్పుడు అదానీ కి కూడా ఆయన బూచి అయ్యారు.