సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే ఏది పడితే అది దానం చేస్తే పుణ్యం రాదని, చెయ్యకూడని వస్తువులు దానాలు చేయడం వల్ల పుణ్యం కాకుండా పాపం వస్తుందని కూడా చెబుతున్నారు.
ఎటువంటి దానాలు చేయకూడదు? ఏ దానాలు చేస్తే మనకు పాపం వస్తుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ మతం లోనైనా దానధర్మాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దానధర్మాలు చేయడం కంటే మరే ధర్మం గొప్పది కాదని అన్ని మతాలు బలంగా విశ్వసిస్తాయి. అయితే కొన్ని దానాల వల్ల అశుభాలు కూడా కలుగుతాయని ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని దానాలు చేస్తే పుణ్యానికి బదులు పాపం కూడా వచ్చి పడుతుందని చెబుతున్నారు. అటువంటి దానాలు ఏమిటి అంటే..
చాలామంది ప్లాస్టిక్ వస్తువులను దానం చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడం వల్ల ఇంటి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాదు ప్లాస్టిక్ దానం చేయడం వల్ల వ్యాపారులకు తీవ్రమైన టువంటి నష్టాలు వాటిల్లుతాయి. చాలామంది ఉక్కు పాత్రలను దానం చేస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఉక్కు పాత్రలను దానం చేయడం ఇంటికి అశుభమని అంటున్నారు.
ఉక్కు పాత్రలను దానం చేయడం వల్ల కుటుంబ శాంతి, సంతోషాలకు భంగం కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఉక్కు పాత్రలను దానం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయని చెబుతున్నారు. చాలామంది నూనెను దానం చేస్తూ ఉంటారు. నూనెను దానం చేయడం మంచిదే అయినప్పటికీ కొందరు ఉపయోగించిన నూనెను వ్యర్థమైనటువంటి నూనెను దానం చేస్తారు. అలా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కాకుండా, చెడు ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. అయితే పాత బట్టలను దానం చేసేవారి చిరిగిపోయిన బట్టలను అసలు దానం చేయకూడదు. అవి దానం చేయడం అశుభం. అంతేకాదు హానికరమైన వస్తువులను, కత్తులు, కత్తెరలు వంటి వాటిని దానం చేయడం కూడా అశుభమని చెబుతున్నారు. కాబట్టి దానం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే మనకు పుణ్యం వస్తుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.