TELANGANA

ఎండకాలంలో ఉన్నట్టుగా వేడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండకాలంలో ఉన్నట్టుగా వేడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 15 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెగడంతో ప్రజలు, ఫ్యాన్లు, ఏసీలను తెగ వాడేశారు.

పలు చోట్ల పండలు ఎండిపోయాయి. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడ్డాయి.

నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి పయనమయ్యాయి. వదర్భ నుంచి కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్ గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర 4.5 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనలు దక్షణాదికి వచ్చాయి. దీంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని చాలా వర్షాలు కురిశాయి. నేటి నుంచి మంగళవారం వరకు తెలంగాణ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కొత్తగూడెం, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో ఉరుమురులు, మెరుపులతో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇటు హైదరాబాద్ లో ఆదివారం ఉదయం చిరుజల్లులు కురుశాయి. దీంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గింది.

అటు ఏపీలో వచ్చే మూడు రోజుల్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు చోట్ల తేలిపాకటి నుంచి మోస్తర వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి వానలు పడాలి. కానీఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు పడలేదు. రుతపవనాలు మందకొండి మారడంతో వానలు పడలేదు. గత నెల రోజులుగా అల్పపీడనాలు, ద్రోణులు లేని కారణంగా వర్షాలు కురవలేదని వాతావరణ శాఖ తెలిపింది.