National

బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం

బెంగళూరు/హావేరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించాలని బీజేపీ సిద్దం అవుతోంది.

బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. హవేరి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని రంగంలోకి దింపుతున్నారని తెలిసింది.

2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. కొత్త అభ్యర్థి కోసం అన్వేషణలో ఉన్న బీజేపీ నాయకత్వం సిట్టింగ్ ఎంపీ శివకుమార్ స్థానంలో హావేరి లోక్‌సభ నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ని పోటీకి దింపాలని ఆలోచిస్తోందని తెలిసింది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని బీజేపీ సిట్టింగ్ ఎంపీ శివకుమార్ ఉదాసి చెప్పారు.

ఇప్పటికీ శింగ్లావి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బసవరాజ్ బోమ్మయ్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శింగ్గావి నియోజకవర్గం ధారవాడ లోక్‌సభ నియోజకవర్గానికి చెందినప్పటికీ, హవేరి జిల్లాలో మాజీ సీఎంకు గణనీయమైన ప్రభావం ఉంది. అంతేకాకుండా బసవరాజ్ బోమ్మయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హవేరీ జిల్లా అభివృద్ధికి చేసిన పనులను గమనించిన బీజేపీ హైకమాండ్ లోక్ సభ ఎన్నికల్లో బసవరాజ్ బోమ్మయ్ ని అక్కడి నుంచి గెలిపించాలని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.

బీజేపీకి సవాల్‌గా మారిన హవేరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి గదగ్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కూడా రానున్నాయి. ఎందుకంటే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గదగ్ జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో బీజేపీ రెండు జిల్లాల్లో ఘోరంగా ఓడిపోయింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శింగ్లావిలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ మాత్రమే విజయం సాధించారు, మిగిలిన ఆరు నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ఐదు నియోజక వర్గాల్లో మేమ పట్టుసాధించామని కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం నెలకొంది. హావేరి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ గెలవడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ధారవాడ డివిజన్ కు చెందిన సీనియర్ నాయుకుడు ఒకరు మాట్లాడుతూ హావేరిలో బీజేపీకి ఎదురైన సవాల్ గురించి మాకు తెలుసు, హావేరీకి అర్హులైన అభ్యర్థిని ప్రకటిస్తామని అంటున్నారు.

సెప్టెంబరు మొదటి వారంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సర్వేను ప్రారంభిస్తామన్నారు. 2009 నుంచి హావేరీ నుంచి శివకుమార్ ఉదాసి వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారని. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారని, దీంతో మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తనయుడు కాంతేశ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిద్దరాజు కల్‌కోటి, ఓబీసీ నేత రాజశేఖర్‌ కట్టెగౌడ్‌ బీజేపీ టికెట్‌ కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత ఎన్నిక జాప్యంపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బీజేపీపై పలు విమర్శలు గుప్పించడంతో బీజేపీ జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ గురువారం బెంగళూరులో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు. ఈ సమయంలో శాసనసభలో ప్రతిపక్ష నేత నియామకంలో జాప్యంపై కూడా చర్చ జరిగింది. దీంతోపాటు బసవరాజ్ బోమ్మయ్ పాత్రపైనా చర్చ జరిగింది. మొత్తం మీద ఇప్పటి నుంచే బీజేపీ నాయకులు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై లోతుగా ఆలోచిస్తోందని తెలిసింది.