ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది.
జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇదిలా ఉంటే.. అండర్-19 ప్రపంచకప్ ఇది 15వ ఎడిషన్. ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో జింబాబ్వే.. ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 13న జరగనుంది. ఇంతకుముందు 2006లో శ్రీలంకలో అండర్-19 ప్రపంచకప్ నిర్వహించారు. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి శ్రీలంక గడ్డపై అండర్-19 ప్రపంచకప్ నిర్వహిస్తున్నారు. అయితే భారత్ ఏ జట్టుతో కలిసి మ్యాచ్ ఆడనుందో ఇక్కడ తెలుసుకుందాం.
భారత జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్:
14 జనవరి 2024- భారత్ vs బంగ్లాదేశ్
18 జనవరి 2024- భారత్ vs USA
20 జనవరి 2024- భారత్ vs ఐర్లాండ్
మరోవైపు అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచింది. గత ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. టైటిల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 189 పరుగులు చేసింది. భారత జట్టు 6 వికెట్లకు 195 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి భారత జట్టు తన టైటిల్‌ను కాపాడుకోవడానికి వెళ్లనుంది. ఈసారి జరుగనున్న వరల్డ్ కప్ లో భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చూపిస్తుందో చూడాలి మరీ.