National

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం

అనంత, సత్యసాయి జిల్లాల నుంచి గుత్తా ప్రభాకర్ నాయుడు, అయ్యన్నగారి శ్రీనివాస్ హాజరు..

చెన్నై: ఐ.జే.యు. 10 వ ప్లీనరీ (జాతీయ మహాసభలు) శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభసభ 30 వ తేదీ ఉదయం 11 గంటలకు చెన్నైలోని డి.బి.ఎన్.మహల్ కామ్రేడ్ కే.అమర్నాథ్ హాల్ లో ఉత్సాహపూరిత వాతావరణంలో మొదలు అయ్యింది. తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి , బీజీపీ సీనియర్ నేత డా.హెచ్.వి. హాండే (95) జాతీయ పతాకాన్ని ఎగురవేసి సందేశం ఇచ్చారు. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి
వి. నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారతీయ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ సీనియర్ నేత ఎల్.ఎస్. హర్దేనియా ప్రారంభోపన్యాసం చేశారు.
ఐ.జే.యు.అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేశారు. తమిళనాడు జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు డి.ఎస్.ఆర్.సుభాష్ స్వాగతం పలికారు. ఐజెయూ సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, ఐజెయు పూర్వాధ్యక్షులు ఎస్.ఎన్. సిన్హా, దేవులపల్లి అమర్ , నాయకులు అంబటి ఆంజనేయులు, సోమసుందర్, నరేందర్ రెడ్డి, ఐ వీ సుబ్బారావు, ఆలపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి గుత్తా ప్రభాకర్ నాయుడు, అయ్యన్నగారి శ్రీనివాసులు హాజరయ్యారు. దాదాపు 20 రాష్ట్రాలనుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.