National

తాగిన మైకంలో పలువురిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని చెప్పుతో కొట్టిన కానిస్టేబుల్

మాములుగా తాగుబోతులు అంటే వారికి పికలదాక తాగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే అయినా ఉత్తరప్రదేశ్‌ కానిస్టేబుల్ ఒకరు ఓ తాగుబోతు వ్యక్తిపై రెచ్చిపోయాడు.
ఏకంగా 61 సార్లు అతడిని చెప్పుతో కొట్టాడు. హర్దోయ్ జిల్లాలో ఈ దారుణం జరగ్గా ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కానీస్టేబుల్ దాష్టీకానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. శనివారం దినేశ్ ఆత్రీ అనే కానిస్టేబుల్ సాధారణ దుస్తుల్లో మార్కెట్‌కు వెళ్లారు.

అక్కడ ఆయనకు ఓ వ్యక్తి తాగిన మైకంలో మహిళతో సహా పలువురిని ఇబ్బంది పెడుతూ కనిపించాడు. ఉచితంగా కూల్ డ్రింక్స్ ఇవ్వాలంటూ అక్కడి షాపుల వారితో గొడవకు దిగాడు. అయితే, ఆత్రి అతడిని వారించేందుకు ప్రయత్నించగా వారిద్దమధ్య వాగ్వాదం మొదలైందని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్‌తో కూడా ఆ వ్యక్తి ఇష్టారీతిన వ్యవహరించడంతో కానిస్టేబుల్ అతడిపై చేయిచేసుకున్నట్టు చెప్పుకొచ్చారు.

ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని ఏఎస్పీ దుర్గేశ్ కుమార్ పేర్కొన్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని చెప్పిన ఆయన.. ఆ కానిస్టేబుల్‌ను తక్షణం సస్పెండ్ చేసినట్టు చెప్పారు.