National

ఈ సీఎంకు బుద్దిలేదు, నాకున్న తెలివి కూడా లేదు, 8 ఏళ్ల బాలుడు ఫైర్ !

బెంగళూరు/చామరాజనగర్: తమిళనాడుకు కావేరీ (cauvery) జలాలను మళ్లించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి కర్ణాటక బంద్ నిర్వహించారు.

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ నిరసన తీవ్రతరం అవుతోంది. అలాగే నిరసన కార్యక్రమంలో మూడో తరగతి బాలుడు సీఎం సిద్ధరామయ్యపై (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్ !

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నాకున్నంత తెలివితేటలు లేవని, అసలు సీఎం సిద్దరామయ్యకు నాకు ఉన్న బుద్దికూడలేదని ఆ బాలుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం చామరాజనగర్ కు వదిలే నీటిని తమిళనాడుకు విడుదల చేసిందని ఆ బాలుడు ఆరోపించారు. తమిళనాడుకు నీరు (cauvery)విడుదల చేసిన సీఎం సిద్దరామయ్యకు (Siddaramaiah)చామరాజనగర ప్రజలు గిన్నెలు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవని తెలీదా అని బాలుడు ప్రశ్నించాడు.

ఆ విషయం కూడా సిద్దరామయ్యకు (Siddaramaiah) కనపడలేదని 3వ తరగతి చదువుతున్న బాలుడు ఆరోపణలు చేశాడు. నాకు తెలివితేటలు ఉన్నాయని, కర్ణాటక ప్రభుత్వంలోని పెద్దలకు, సీఎం సిద్దరామయ్యకు (Siddaramaiah)తనకు ఉన్న తెలివితేటలు లేవని ఆ బాలుడు మీడియా ముందు మాట్లాడటంతో అందరూ బిత్తరపోయారు. కావేరీ (cauvery)నీటిని తమిళనాడుకు విడుదల చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వాన్ని తాను అసహ్యించుకుంటున్నానని ఆబాలుడు అన్నాడు.

కర్ణాటక బంద్, బంద్ అంటే ఇదే బాసు, 44 విమానాలు రద్దు, రక్తం ఇస్తాం కాని నీళ్లు ఇవ్వం !

కర్ణాటకలో వర్షాలు లేనప్పుడు కావేరి నీరు తమిళనాడుకు ఎలా ఇవ్వాలి? అనే విషయం సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah)తెలియడం లేదని, కావాలనే తమిళనాడుకు కావేరి (cauvery) నీటిని విడుదల చేశారని ఆ బాలుడు ఆరోపించాడు. చామరాజనగరలో 3వ తరగతిచదువుతున్న బాలుడు తనకు ఉన్న బుద్ది సీఎం సిద్దరామయ్యకు లేదని చెప్పడం కన్నడ మీడియాలో తీవ్రచర్చకు దారితీసింది. సీఎం సిద్దరామయ్యను (Siddaramaiah) మీడియా ముందు తీవ్రస్థాయిలో విమర్శించిన బాలుడు మైనారిటీ వర్గానికి చెందిన వాడు కావడం, మైనర్ కావడంతో కాంగ్రెస్ నాయకులు ఆ బాలుడిని విమర్శించలేక సైలెంట్ గా ఉండిపోయారు.