బెంగళూరు/చెన్నై: కావేరీ నదీ (cauvery) జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అక్టోబర్ 10వ తేదీన కర్ణాటక-తమిళనాడు (tamil nadu) సరిహద్దుల్లో బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు కన్నడ సమాఖ్య అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ తెలిపారు.
మద్దూరు పట్టణంలోని సంజయ్ సినిమా సమీపంలోని కావేరీ కాలువల నుంచి నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు.
బెంగళూరు నుంచి కన్నడ పోరాట సంఘాల నాయకులు కేఆర్ఎస్ డ్యామ్ (cauvery) ముట్టడి కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు, ఈ కార్యక్రమానికి వాటల్ నాగరాజ్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సందర్బంగా వాటల్ నాగరాజ్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడుకు కావేరీ జలాలను కర్ణాటక ప్రభుత్వం ఆపకుంటే అక్టోబర్ 10వ తేదీన హోసూరు, చామరాజనగర్, కనకపూర్ సరిహద్దుల్లోని తమిళనాడు (tamil nadu) సరిహద్దులు పూర్తిగా మూసి వేస్తామని, రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తామని వాటల్ నాగరాజ్ అన్నారు.
కర్ణాటక (Karnataka) -తమిళనాడును కలిపే సరిహద్దు ప్రాంతాలు మూసివేస్తామని వాటల్ నాగరాజ్ హెచ్చరించారు. ఈ విషయంలో జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని వాటల్ నాగరాజ్ ప్రకటించారు. కావేరి (cauvery) సమస్యపై తమిళనాడు (tamil nadu) రాజకీయ నాయకులు కర్ణాటకపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారని, బ్లాక్ మెయిలింగ్ ఆపాలని, లేకుంటే కన్నడిగుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాటల్ నాగరాజ్ హెచ్చరించారు.
కావేరి (cauvery) జలలాల పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన కేఆర్ఎస్ రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమానికి రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేసే విషయంలో కర్ణాటక (Karnataka)ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, ఇతర మంత్రులు పిరికిపందల్లా వ్యవహరిస్తున్నారన్నారని వాటల్ నాగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కావేరి (cauvery) నీటి సమస్యపై నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు వాటాల్ నాగరాజ్ తో పాటు కన్నడ సంఘాల నాయకులు, కార్యకర్తలు కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదులు చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపేవాళ్లం. రైతు పోరాటం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. వెంటనే కర్ణాటక ప్రభుత్వం కావేరి నీటిని తమిళనాడుకు (tamil nadu) వదలడం మానుకోవాలని సిద్దరామయ్య ప్రభుత్వానికి కన్నడ సంఘాలు మనవి చేశాయి,