ప్రస్తుతం పితృ పక్షాలు కొనసాగుతున్నాయి. పితృ పక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ వారిని ఆశీర్వదిస్తారని సనాతన ధర్మంలో చాలా బలంగా నమ్ముతారు.
ఇక పితృదేవతలను పూజించేవారు, ఇళ్లల్లో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి? పూర్వీకుల ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటే వారికి కలిసి వస్తుంది? ఏ దిక్కులో పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు? వంటి వివరాలను కూడా తెలుసుకోవాలి.
చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం వారి జ్ఞాపకార్ధం చాలా మంది ఇళ్లల్లో ఫోటోలు పెట్టుకుంటారు. అయితే చనిపోయిన వాళ్ళ ఫోటోలను ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు. కొంతమంది చనిపోయిన తమ పూర్వీకులు దైవ సమానులని భావించి దేవుని గదిలో ఫోటోలను పెట్టుకుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.
చనిపోయిన వారి ఫోటోలను ఇంటినిండా పెట్టుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఎక్కువగా చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరుగుతాయి. చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి పూజ చేస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది.
చనిపోయిన వారి ఫోటోలను పడకగదిలో పెట్టుకోకూడదు. అంతేకాదు బ్రతికున్న వాళ్ళ ఫోటోల పక్కన చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల బ్రతికున్న వాళ్ళ ఆయుష్షు కూడా తగ్గుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం కూడా లేకపోలేదు.
చనిపోయిన వారి ఫోటోలను దక్షిణం వైపున ఉన్న గోడకు ఉత్తరం గోడ వైపుకు చూస్తూ ఉండేలా పెట్టాలి. నైరుతి దిశలో నే పూర్వీకుల ఫోటోలు పెడితే మంచి జరుగుతుంది. ఇలా ఫోటోలు సరైన వాస్తు దిశలో పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి, ఇంట్లో సానుకూలమైన వాతావరణం వస్తుంది. సరైన దిశలో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల పితృ దేవతల ఆశీర్వాదాలు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభిస్తాయి.