National

అన్ స్టాపబుల్ షోలో రెచ్చిపోయిన బాలయ్య

నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న ఫన్ షో అన్ స్టాపబుల్ తాజా షో ఇవాళ సాయంత్రం నుంచి ప్రసారం ప్రారంభమైంది. ఈ మధ్యే విడుదలైన ఈ షో ప్రోమోలో పలు పంచ్ లు విసిరిన బాలయ్య..

షోలోనూ వాటిని కొనసాగించారు. అంతే కాదు వాటికి మరింత సినిమా మసాలా జోడించి ఏపీ రాజకీయాలపై పంచ్ లు విసిరారు. ముఖ్యంగా చంద్రబాబు ఎపిసోడ్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ జగన్ పై బాలయ్య వేసిన డైలాగులు ఈ షోలో హైలెట్ గా ఉన్నాయి.

ఏపీలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్, కస్టడీ, బెయిల్, కోర్టుల నిర్ణయాలు ఇలా సుదీర్ఘంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య తన అన్ స్టాపబుల్ తాజా షోలోనూ ఎక్కడా చంద్రబాబు, జగన్ పేరెత్తకుండానే, ఏ కేసుల గురించి మాట్లాడకుండానే పంచ్ లు విసిరారు. వాటిని చూస్తే అవి ఎవరిమీద విసిరారో ఇట్టే అర్ధమయ్యేలా ఉంది.

తాజాగా విడుదల చేసిన అన్ స్టాపబుల్ ప్రోమోలో “మేం తప్పుచేయలేదని మీకు తెలుసు, మేం తలవంచమని మీకు తెలుసు, మనల్ని ఆపడానికి ఎవరూ రాలేడనీ తెలుసు” అంటూ బాలయ్య డైలాగ్ లు పేల్చారు. ఇప్పుడు షోలోనూ అంతకు మించిన పంచ్ లు విసిరారు. రాష్ట్రంలో పరిస్ధితుల్నిసెట్ చేయడానికి జైలు నుంచి ఒకడు బయటికి రావాలంటూ చంద్రబాబును ఉద్దేశించి బాలయ్య ఈ ఎపిసోడ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

“సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి” అంటూ బాలయ్య అన్ స్టాపబుల్ లో వేసిన డైలాగ్ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలంటూ చెప్పిన డైలాగ్ చంద్రబాబును ఉద్దేశించే అని అర్ధమవుతోంది.

మరో చోట “మా మాట సుపరిచితం, మా బాట సుపరిచితం. మేము ఏంటో మా వాళ్లేంటో.. మా వెంట ఉండే మీకు సదా నమ్మకం అంటూ.. ప్రారంభించి.. రోజులు మారినా రుతువులు రంగులు మార్చినా.. ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా.. మళ్లీ చంద్రుడు ఉదయిస్తూనే ఉంటాడు. గడ్డుకాలంలో కరుడుగట్టిన గుండె ధైర్యం.. చెడ్డపని చేయలేదు అనే మానసిక స్థైర్యం.. మన జీవితంలో అలుపులేని పోరాటానికి ఊతమిస్తుంది. మరపురాని గెలుపు తీరాలకు చేర్చుతుందన్నారు.” బాలయ్య