National

ఏంరా బచ్చా ఫ్రీగా తిరుగుతున్నామని చులకనా ?, ఆర్ టీసీ కండెక్టర్ ను లేడీస్ ఏం చేశారంటే?

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం వల్ల కేఎస్‌ఆర్‌టీసీ (KSRTC) బస్‌ కండక్టర్లు, డ్రైవర్లు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారని ఆర్ టీసీ (RTC) ఉద్యోగులే ఆరోపిస్తున్నారు.

ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సీఎం (CM) సిద్దరామయ్య ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో పోలో అంటూ ఆర్ టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కర్ణాటకలోని (Karnataka) అన్ని డిపో బస్సులు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

 

కర్ణాటకలోని (Karnataka) చిత్రదుర్గ జిల్లాలోని చెల్లకెరెలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో కేఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్ అండ్ కండక్టర్‌ను (conductor) కొందరు మహిళలు చితకబాదేశారు. మహిళా ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ఓ ఆర్ టీసీ బస్సు డ్రైవర్ అండ్ కండెక్టర్ పై (conductor) దాడి చేసిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకెరెలోని నెహ్రూ సర్కిల్ వద్ద చోటుచేసుకుందని పోలీసులు అంటున్నారు.

మహిళ చేతిలో దాడికి గురైన బస్సు డ్రైవర్ అండ్ కండెక్టర్ (conductor)చంద్రేగౌడ్‌గా గుర్తించామని పోలీసులు అంటున్నారు. రాయదుర్గం-బెంగళూరు మార్గంలో బస్సు కండక్టర్ అండ్ డ్రైవర్ గా చంద్రేగౌడ విధులు నిర్వహిస్తున్నారు. అదే బస్సులో చెల్లకెరెకు చెందిన మహిళ ఎక్కింది. ఆ మహిళ చెల్లకెరె నుంచి బెంగళూరు (Bengaluru) నగర శివార్లలోని నెలమంగల సమీపంలోని డాబస్ పట్టణానికి వెళ్లింది.

 

అనంతరం దాబాసపేటకు చేరుకోగానే మహిళ బస్సును ఆపాలని కోరగా డ్రైవర్ అండ్ కండక్టర్ (conductor) చంద్రేగౌడ్ బస్సును నేరుగా డాబస్ సేటలో ఆమె చెప్పిన చోట కాకుండా కెంపేగౌడ బస్టాండ్‌లో తీసుకు వచ్చి అక్కడే ఆపేశాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఇదేమని అడిగిన మహిళతో (lady) కండెక్టర్ అండ్ డ్రైవర్ చంద్రేగౌడ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో భయాందోళనకు గురైన మహిళ జరిగిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు (family) చెప్పింది. రెండు రోజుల తరువాత మహిళ బంధువులు చెల్లకెరె బస్టాండ్ సమీపంలో బస్సు కండక్టర్ (conductor)చంద్రేగౌడ కోసం వేచి ఉన్నారు. బస్సు బస్ స్టాండ్ కు చేరుకోగానే కండక్టర్‌ చంద్రేగౌడను పట్టుకుని చితకబాదేశారు. దాడికి గురైన కండెక్టర్ (conductor)అండ్ డ్రైవర్ చంద్రేగౌడ ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన చెల్లకెరె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అయితే ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెల్లకెరె పోలీసులు (police) తెలిపారు.