APNational

తిరుమలలో గరుడసేవ, ఎన్ని లక్షలాది మంది భక్తులు, గోవిందా గోవింద, జన్మధన్యం స్వామి!

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా గురువారం సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై (Garuda Vahana) శ్రీవారు విహరించారు.

తిరుమలలోని (Tirumala) తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది శ్రీవారి భక్తులు వెయ్యి కళ్లతో వేచి చూశారు. శ్రీవారి భక్తులతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.

 

తిరుమలలో (Tirumala) గురువారం ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగో తిరుమాడ వీధుల్లో మోహనీ అవతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. మోహనీ అవతారంలో శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తులు తిరుమాడ వీధుల్లోని గ్యాలరీల్లో నుంచి ఏమాత్రం కదల్లేదు. గురువారం వేకువజామున స్నానాలు చేసుకుని గ్యాలరీల్లోకి వచ్చిన భక్తులు తరువాత అక్కడి నుంచి కదల్దేదు.

ఎండ, గాలిని లెక్కచెయ్యకుండా శ్రీవారి భక్తులు తిరుమాడ వీధుల్లో గరుడ వాహన (Garuda Vahana) సేవ చూడాలని సాయంత్రం వరకు వేచి చూశారు. తిరుమాడ వీధుల్లోని (Garuda Vahana)గ్యాలరీల్లో ఉన్న శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు టీలు, టిఫిన్లు భోజనాలు, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ, పులిహోర, పెరుగన్నం, చిత్రాన్నం అందించారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో గోవిందుడు!

తిరుమలలో (Tirumala) గురువారం రాత్రి జరిగిన గరుడ సేవ (Garuda Vahana) సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం తిరుమలలో (Tirumala) 3,400 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. గరుడ సేవ సందర్బంగా శ్రీవారి భక్తులకు (Brahmotsavam) ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూశామని, భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ (SP) పరమేశ్వరరెడ్డి అన్నారు.