భగవంత్ కేసరి కలెక్షన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది.
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. బాలయ్య కొత్త సినిమామీ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఇక సినిమా టీం రోజు బాక్సాఫీస్ కలెక్షన్లను అధికారికంగా విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే కలెక్షన్లు పెంచి అనౌన్స్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేస్తుండగా దానికి కౌంటర్ ఇస్తూ అనిల్ రావిపూడి సమాధానం ఇచ్చారు. భగవంత్ కేసరి టీమ్ అధికారికంగా విడుదల చేసిన కలెక్షన్స్ ఏమాత్రం ఫేక్ కాదని, జెన్యూన్ నంబర్స్ పోస్ట్ చేస్తున్నాయని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అన్నారు.
సక్సెస్ టూర్‌లో భాగంగా, ఎఫ్ 2 దర్శకుడు ఈ రోజు చాలా థియేటర్‌లను సందర్శించాడు. ఈ క్రమ్మలో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, కలెక్షన్ల గురించి మాట్లాడాడు. కొంతమంది నిర్మాతల నుండి అధికారిక గణాంకాల కంటే తక్కువ నంబర్‌లను పోస్ట్ చేస్తే, తాను వాటి గురించి బాధపడనని చెప్పాడు. భగవంత్ కేసరి బాక్సాఫీస్ నంబర్లు ఫేక్ అని ప్రొడ్యూసర్స్ పెంచి రిలీజ్ చేస్తున్నారు అని కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఇది బ్లాక్ బస్టర్ అని నిరూపించడానికి దర్శకుడు పోస్టర్‌లో అసలు వాటి కంటే ఎక్కువ కలెక్షన్స్ వేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, అనిల్ రావిపూడి అన్ని పుకార్లను త్రోసిపుచ్చారు. ఈ సినిమా కలెక్షన్లు నిజమైనవని, ఏమాత్రం పెంచలేదని ఆయన అన్నారు. ఇక మరోపక్క భగవంత్ కేసరి యూనిట్ సక్సెస్ యాత్రను ప్రారంభించింది, ఈ రోజు వైజాగ్, రాజమండ్రి, ఏలూరు లోని థియేటర్లను సందర్శించింది.