National

మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్: ప్రధాని మోడీ..

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మార్చి 2020 నుంచి ఈ పథకాన్ని తీసుకొచ్చారు.