ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసింది. 2004 నుంచి ఎర్ర చందనం పెంపకంపై కేంద్రం ఆంక్షలు విధించగా తాజాగా వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎర్ర చందనంపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీని ప్రకారం ఎర్ర చందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.