అయోధ్య రామాలయం ప్రారంభ వేడకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్సీపీ నేత జితేంద్ర శ్రీరామునిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పడు ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. శ్రీరాముడు మాంసాహారి. రాముడు జంతువులను వేటాడి, వాటిని తినేవాడు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. మరికొద్ది రోజుల్లో అయోధ్య రామలయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారం రేపుతున్నాయి. కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే రాముని గురించి జితేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాముడు బహుజనులకు చెందినవాడు. వేటాడటం, జంతువులను తినడం చేసేవాడు. రాముడిని చూపుతూ వీళ్లంతా అందరినీ శాకాహారులుగా మార్చాలనుకుంటున్నారు. కానీ రాముడు మాంసాహారి. 14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు వెజిటేరియన్ ఫుడ్ ను ఎక్కడి నుంచి తెచ్చుకోగలడు?’ అని ప్రశ్నించారు. అయోధ్య రామాలయ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే లాంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేగుతోంది.
జితేంద్రను అరెస్టు చేయాలంటూ డిమాండ్ : ముంబైలోని జితేంద్ర నివాసం వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో, ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుల చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నేతృత్వంలో నిరసనకారులు పోలీస్ స్టేషన్ వరకూ పాదయాత్ర చేసి అక్కడ జితేంద్రపై ఫిర్యాదు చేస్తామని తేల్చి చెప్పారు. జితేంద్ర శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.