AP

ఓటమి భయంతో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల పరుగు..!

ఏపీలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను మారుస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఐప్యాక్ చేస్తున్న సూచనలతో జగన్ చేస్తున్న మార్పుల్లో దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తమ సిట్టింగ్ స్ధానాల్ని కోల్పోవడమో, మారడమో జరిగిపోయింది. దీనిపై సొంత పార్టీ వైసీపీతో పాటు విపక్షాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నిర్ణయాలపై టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ స్పందించారు.

 

ఇప్పటివరకూ 35 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తమ సొంత స్ధానాల్లో పోటీకి అధిష్టానం నిరాకరించిందని లోకేష్ తెలిపారు. ఇది ఆసన్నమైన ఓటమి భయమని, వైసీపీ శ్రేణులు, ఫైల్‌లలో విశ్వాసం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ 35 మందితో పాటు మరో 50 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడం లేదని వినిపిస్తోందన్నారు. కానీ, పారిపోయినా, సీట్లు మారినా, వైఎస్సార్సీపీ ఓడ మునిగిపోకుండా ఏదీ అడ్డుకోదన్నారు.

 

రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాగ్రహం నేపథ్యంలో ఓటమి భయంతో పారిపోతున్నారని, వీరిని ఏదీ కాపాడలేదని లోకేష్ తన ట్వట్ లో తెలిపారు. తద్వారా వైసీపీ ఓటమి ఖాయమనే అర్ధం వచ్చేలా లోకేష్ పోస్టు పెట్టారు. ఇప్పటికే వైసీపీలో సీట్లు దక్కని పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనతో టచ్ లోకి వెళ్తున్నారు. వైసీపీ మూడో జాబితా ప్రకటించాక ఈ సంఖ్య మెరింత పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.