National

పేటీఎం కథ ముగిసినట్లేనా…?

పేటీఎంపై ఆర్బీఐ పలు ఆంక్షాలు విధించడంతో పేటీఎం షేర్లు కుప్పకూలుతున్నాయి. అయితే పేటీఎం సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఆర్బీఐ ఆంక్షాలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఎలాంటి డిపాజిట్లు సేకరించ కూడా ఆర్బీఐ నిషేధం విధించింది. అంతేకాదు పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయకుండా ఆదేశించింది. దీంతో పేటీఎం వాడే వారు ఏం చేయాలో అర్థం కాకా అయోమయంలో పడిపోయారు.

 

ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పని చేస్తోంది. ఆలోపు డిపాజిట్లు చేయడంతో పాటు ఇతర సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ 29 తర్వాత పై పేర్కొన్న సేవలు అందుబాటులో ఉండవు. దీంతో పేటీఎం ఉంటుందా.. ఉడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేటీఎం భవితవ్యం ఆర్బీఐపై ఆధారపడి ఉంది. ఆర్బీఐ నిత్యం ఎన్బీఎఫ్సీ, బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల్లో ఏం జరుగుతోందో గమనిస్తుంది. ఏవైన తప్పులు జరిగినప్పుడు చర్యలు తీసుకుంటుంది.

 

పేటీఎం కూడా సరైన నిబంధనలు పాటించకపోవడంతో చర్యలు తీసుకుంది. అందుకే పేటీఎం భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పేటీఎం వినియోదారులు జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది పేటీఎం ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టారు. స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు.

 

దీనంతటికీ పేటీఎం తప్పులే కారణంగా తెలుస్తోంది. పేటీఎం వాడుతున్న లక్షలాది కస్టమర్లకు కేవైసీ లేదని ఆర్బీఐ గుర్తించుంది. ఒకే పాన్ కార్డుతో మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు తేలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో 35 కోట్ల ఇ వాలెట్లు ఉన్నట్లు తేలింది. కానీ ఇందులో 31 కోట్ల ఇ వాలెట్లు పనిచేయడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఏదో జరిగినట్లు అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం పేటీఎం వినియోగదారులే కాదు.. పెట్టుబడి దారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పేటీఎం ఐపీఓ ప్రైస్ నుంచి ఇప్పటికీ డిస్కౌంట్ లో ట్రేడవుతోంది. తాజా ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం పాతాలానికి పడిపోయింది.