National

16 ఎంపీ స్థానాలకు ప్రకటించిన జేడీయూ.

లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీహార్ రాష్ట్రంలో అధికార పార్టీ జేడీయూ ఆదివారం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో జేడీయూ పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. జేడీయూ పార్టీ మాజీ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లన్ సింగ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది.

 

రంజన్.. ముంగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. ఇద్దరు కొత్తవారికి అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన మరుసటి రోజే విజయలక్ష్మి కుషావహాకు టికెట్ కేటాయించారు. ఆర్జేడీ నుంచి ఇటీవలే జేడీయూకి వచ్చిన లవ్లీ ఆనంద్ కూడా ఈసారి పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

 

సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఇటీవలే పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి నుంచి కూడా జేడీయూ వైదొలిగి పెద్ద షాకిచ్చింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమికి పలు పార్టీలు కూడా దూరమయ్యాయి.

 

జేడీయూ అభ్యర్థుల వివరాలు:

 

బాల్మీకి నగర్ – సునీల్ కుమార్

 

శివహర్ – లావ్లీ ఆనంద్

 

సీతామర్హి – దేవేష్ చంద్ర ఠాకూర్

 

ఝంఝర్‌పూర్ – రాంప్రీత్ మండల్

 

సుపాల్ – దిలేశ్వర్ కమైత్

 

కిషన్‌గంజ్ – ముజాహిద్ ఆలం

 

కతిహార్ – దులాల్‌చంద్ర గోస్వామి

 

పూర్ణ – సంతోష్ కుమార్

 

మాధేపురా – దినేష్ చంద్ర యాదవ్

 

గోపాల్‌గంజ్ – అలోక్ కుమార్ సుమన్

 

శివన్ – అలోక్ కుమార్ సుమన్

 

భాగల్పూర్ – అజయ్ కుమార్ మండల్

 

బంకా – గిరిధారి యాదవ్

 

ముంగేర్ – రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లన్ సింగ్

 

నలంద – కౌశలేంద్ర కుమార్

 

జెహనాబాద్ – చందేశ్వర ప్రసాద్