National

చిన్నస్వామి తొక్కిసలాట ఘటన.. కోహ్లీపై నిందలు వేస్తారా అంటూ బీజేపీ ఫైర్..!

ఐపీఎల్ విజయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవాలని భావించిందని, ప్రమాదం జరిగిన తర్వాత విరాట్ కోహ్లీ, ఆర్సీబీని నిందిస్తోందని కర్ణాటక బీజేపీ విమర్శించింది. ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల నివేదికను విడుదల చేసింది.

 

ఈ నివేదికలో కోహ్లీ, ఆర్సీబీని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవాలని చూస్తోందని బీజేపీ నేత అరవింద్ విమర్శించారు. ఈ వేడుకలకు ఆర్సీబీ ఒక్కటే ప్రజలను ఆహ్వానించలేదని, కాంగ్రెస్ కూడా ఆహ్వానం పలికిందని గుర్తు చేశారు.

 

ఆర్సీబీదే తప్పయితే ప్రభుత్వం పోలీసు అధికారులను ఎందుకు సస్పెండ్ చేసిందో చెప్పాలని నిలదీశారు. ఈవెంట్ నిర్వహిస్తామని ఆర్సీబీ చెబితే అనుమతి నిరాకరించి ఉండాల్సింది కదా అన్నారు. కానీ ఈవెంట్ క్రెడిట్ తీసుకోవాలనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలను ఆహ్వానించారని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కోహ్లీ, ఆర్సీబీ మీద నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.