ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. లిక్కర్ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగింది. అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో ఎక్కువగా ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ సాగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సీబీఐ విచారణను కేసీఆర్‌కు ఆమె వివరిస్తున్నారు. విచారణ అనంతరం సీబీఐ అధికారులు కవిత ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత న్యాయవాదితో మాట్లాడారు. ఇంటి నుంచి బయటకు వచ్చి, ఇంటి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆమె అభివాదం చేశారు. అనంతరం కారులో ప్రగతిభవన్ బయలుదేరి వెళ్లి సీఎం భేటి అయ్యారు.