SPORTS

రప్ఫాడిస్తున్న ఆర్సీబీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వాంఖడే స్టేడియంలో పరుగుల వర్షం కురిపిస్తోంది.

తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 104 పరుగులు చేసింది. డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆడుతున్న వీరోచితమైన ఇన్నింగ్స్ పుణ్యమా అని.. ఆర్సీబీ స్కోరు పరుగులు పెడుతోంది. నిజానికి.. మొదటి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడం, ఆ వెంటనే మూడో ఓవర్‌లో అనూజ్ పెవిలియన్ చేరడం చూసి.. ఆర్సీబీ ఒత్తిడికి గురవుతుందని, తద్వారా స్కోరు నత్తనడకన సాగుతుందని క్రికెట్ నిపుణులు అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ రప్ఫాడిస్తున్నారు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల సునామీ సృష్టిస్తున్నారు. తమ 360 డిగ్రీ ఆటతో ఆర్సీబీ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నారు.

తొలుత నిదానంగా తన ఇన్నింగ్స్ ప్రారంభించిన డు ప్లెసిస్, ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. కోహ్లీ ఔట్ అయ్యాక వచ్చిన అనుజ్.. ఒక ఫోర్ కొట్టడం చూసి, ఈరోజు మంచి ఇన్నింగ్స్ ఆడుతాడని భావించారు. కానీ.. అతడు ఒక తప్పుడు షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయ్యాడు. అప్పుడు బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్.. వచ్చి రావడంతోనే తన తడాఖా చూపించడం స్టార్ట్ చేశాడు. మొదట్లోనే రెండు వికెట్లు పోయాయన్న ఒత్తిడికి గురవ్వకుండా.. ఆర్సీబీ బౌలర్లపై దండయాత్ర చేయడం ప్రారంభించాడు. ఇలా విజృంభించడం వల్లే.. అతగాడు వేగంగా తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్ వచ్చాక డు ప్లెసిస్ కాస్త శాంతించాడు. అలాగని మరీ నిదానంగా ఆడట్లేదు. మ్యాక్స్‌వెల్ దూకుడు మీద ఉన్నాడు కాబట్టి, అతనికి ఆడే ఛాన్స్ ఇచ్చాడు. 11వ ఓవర్‌లో డు ప్లెసిస్ సైతం తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. వీరి ఆటతీరు పుణ్యమా అని, ఆర్సీబీ స్కోరు తారాజువ్వలా దూసుకెళ్తోంది. మరి, 20 ఓవర్లలో వీళ్లు ఎంత స్కోరు కొడతారో, ముంబైకి ఎంత లక్ష్యం ఇస్తారో చూడాలి