SPORTS

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్రాంచైజీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అయితే తాను వేరే టీంలో జాయిన్ అవ్వడం లేదని, ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. కాగా పోలార్డ్ ముంబైతో గత కొన్ని సీజన్లుగా ఆడుతున్నాడు. 5 ఐపిఎల్ టైటిళ్లను గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడు కీరన్ పొలార్డ్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న విండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. వచ్చే సీజన్ నుంచి తాను ఐపీఎల్ ఆడటంలేదంటూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. మొదటి నుంచి ముంబై ఇండియన్స్ కే ఆడిన పొలార్డ్ ఐపీఎల్ కు దూరమైనా ముంబై ఇండియన్స్ తోనే కొనసాగనున్నట్లుగా ప్రకటించాడు. ఐపీఎల్ లో 171 ఇన్నింగ్స్ లు ఆడి 3,412 పరుగులు చేసిన కీరన్.. అందులో 16 హాఫ్ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 69 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన పొలార్డ్ ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా మారనున్నాడు.