Technology

అందరికంటే ముందుగా ఇన్విసిబుల్ కెమెరా

వన్‌ప్లస్‌ మాత్రం కాస్త భిన్నమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసే పనిలో పడింది. అందులో భాగంగానే వన్‌ప్లస్‌ త్వరలో కనిపించని (ఇన్విజిబుల్‌) కెమెరాలు కలిగిన ఫోన్లను విడుదల చేయనుంది. మొబైల్స్‌ తయారీదారు వన్‌ప్లస్‌ తాజాగా విడుదల చేసిన ఓ టీజర్‌లో తన కొత్త ఫోన్లలో అందివ్వనున్న ఇన్విజిబుల్‌ కెమెరా ఫీచర్‌ను పరిచయం చేసింది. సదరు కెమెరాలు ఫోన్‌ వెనుక భాగంలో ఓ పారదర్శక గ్లాస్‌ కింద ఉంటాయని మనకు టీజర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ క్రమంలో యూజర్‌ ఫోన్‌లో కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేయగానే వెనుక భాగంలో ఉండే పారదర్శక గ్లాస్‌ ఓపెన్‌ అవుతుంది. అనంతరం కెమెరాలు దర్శనమిస్తాయి. ఆ తరువాత వాటితో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి ఇతర వివరాలను మాత్రం వన్‌ప్లస్‌ ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ ఫోన్‌ను వన్‌ప్లస్‌ జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న కన్‌జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌) 2020లో ప్రదర్శించనుంది. అందులో ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వన్‌ప్లస్‌ వెల్లడించనుంది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference