279 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఎయిర్‌టెల్ తో పాటు ఇతర నెట్వర్క్ లకు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 4 లక్షల రూపాయల హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. బీమాతో పాటు ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు పలు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్ కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ అందుబాటులోకి తెచ్చిన మరో 379 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. 379 రూపాయల ప్లాన్ ను వినియోగదారులు రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ ఔట్ గోయింగ్ కాల్స్ ను పొందవచ్చు. ఈ ప్లాన్ లో వినియోగదారులకు 6 జీబీ డేటా, 900 ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే లభిస్తాయి. 379 రూపాయల ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు ఫాస్టాగ్ కొనుగోలుపై 100 రూపాయల క్యాష్ బ్యాక్ ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రైమ్ సర్వీస్, వింక్ మ్యూజిక్ లాంటి సబ్‌స్క్రిప్షన్లను పొందవచ్చు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference